సొంత మీడియాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోండి : పీసీసీ నేత

సొంత మీడియాలో బీఆర్ఎస్  ప్రచారాన్ని అడ్డుకోండి : పీసీసీ నేత
  • జిల్లా ఎన్నికల అధికారికి పీసీసీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోందని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మీడియాలో ఆ పార్టీ అభ్యర్థి తరపున విచ్చలవిడిగా ప్రచారం చేయిస్తోందని పీసీసీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్​​ను కలిసి ఫిర్యాదు చేశారు. 

మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ( ఎంసీఎంసీ ) నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ విచ్చలవిడిగా ప్రచురిస్తున్న వార్తలను ఆ పార్టీ అభ్యర్థి ఖర్చు కింద పరిగణించాలన్నారు. ఈ మేరకు పీసీసీ ప్రతినిధి రాంమోహన్..రిటర్నింగ్ అధికారికి చేసిన ఫిర్యాదులో   పేర్కొన్నారు. కనీసం మీడియా విలువలు పాటించకుండా నిస్సుగ్గుగా కరపత్రంలా ప్రచురిస్తున్న ఆ పత్రికపై వెంటనే చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేశారు.