ప్రైవేట్‌‌‌‌లో టీకాలకు  జనం ఇంట్రస్ట్ చూప్తలే

ప్రైవేట్‌‌‌‌లో టీకాలకు  జనం ఇంట్రస్ట్ చూప్తలే


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేట్ దవాఖాన్లలో కరోనా టీకాలు వేయించుకునేందుకు జనం పెద్దగా ఇంట్రస్ట్ చూపలే. ప్రైవేట్​లో అందుబాటులో ఉన్న డోసుల్లో 17% డోసులు మాత్రమే వినియోగం అయ్యాయని తేలింది. ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద మే నెలలో 1.29 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉన్నప్పటికీ.. 22 లక్షల డోసులనే వినియోగించినట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసిన గణాంకాలను బట్టి వెల్లడైంది. కేంద్రం ఇటీవలి ప్రకటన ప్రకారం.. మే నెలలో దేశవ్యాప్తంగా 7.4 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు 1.85 కోట్ల డోసులను కేటాయించగా, 1.29 కోట్ల డోసులను మాత్రమే కొనుగోలు చేశాయి. మొత్తంగా17 శాతం డోసుల టీకాలు మాత్రమే వేయగలిగాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో టీకాల ధరలు ఎక్కువగా ఉండటంవల్లే జనం పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదని నిపుణులు చెప్తున్నారు. కాగా, ప్రైవేట్ లో కొవిషీల్డ్ టీకా డోసుకు రూ. 780, స్పుత్నిక్ వీ డోసుకు రూ. 1,145, కొవాగ్జిన్డోసుకు రూ. 1,410 ధరలను కేంద్రం ఇటీవల ఫిక్స్ చేసింది. అన్ని ట్యాక్స్ లు, రూ. 150 సర్వీస్ చార్జ్ ను కలిపి ఈ మేరకు రేటును నిర్ణయించింది.దేశంలో ఇప్పటివరకూ 24 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ ఏడాది చివరినాటికి 108 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రం టార్గెట్​గాపెట్టుకుంది.