రూ.1,796 కోట్ల పెట్టుబడితో డిస్టిలరీ

రూ.1,796 కోట్ల పెట్టుబడితో డిస్టిలరీ

ముంబై:  ఫ్రెంచ్​ కంపెనీ పెర్నార్డ్ ​రికార్డ్​ నాగ్‌‌పూర్‌‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. పారిశ్రామిక ప్రాంతంలోని బుటిబోరిలో దీనిని ఏర్పాటు చేస్తారు. ఇండియాలోని అతిపెద్ద డిస్టిలరీల్లో ఇదీ ఒకటి అవుతుంది. ఇందుకోసం రూ.1,796 కోట్ల వరకు ఇన్వెస్ట్​ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌‌ కోసం పెర్నార్డ్​ రికార్డ్​ ఇండియా దేశవ్యాప్తంగా రైతుల నుంచి ప్రతి సంవత్సరం 50 వేల టన్నుల వరకు బార్లీని కొనుగోలు చేస్తుంది.