
బషీర్ బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు ఇయర్లీ సబ్ స్క్రిప్షన్ పేరిట ఓ వ్యక్తి రూ. 1.4 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం.. నగరానికి చెందిన 46 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగం చేసే వ్యక్తికి సైబర్ చీటర్స్ ఫోన్ చేశారు. అతని క్రెడిట్ కార్డ్ ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ పొరపాటున యాక్టివేట్ అయిందని తెలిపారు. దీన్ని డియాక్టివేట్ చేయడానికి, స్కామర్లు ఓ లింక్‌ను బాధితుడి వాట్సాప్‌కు పంపించారు.
స్కామర్లు పంపిన లింక్‌ను బాధితుడు ఓపెన్ చేశాడు. అనంతరం అతని ఎస్బీఐ క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు కట్ అవుతున్నట్లు ఓటీపీలు, మెసేజ్‌లు వచ్చాయి. బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1,04,742 కట్ అయినట్లు గ్రహించాడు. సాయం కోసం బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ
వెల్లడించారు.