కారుపై కూలిన విమానం..ఇద్దరు సజీవ దహనం

కారుపై కూలిన విమానం..ఇద్దరు సజీవ దహనం

గాల్లో ప్రయాణిస్తున్న విమానం...రోడ్డుపైకి దూసుకొచ్చింది. అంతేకాదు అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై కుప్పకూలింది.ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగింది.

దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్‌ పెర్రీ ఎయిర్ పోర్టు నుంచి సింగిల్‌ ఇంజన్‌ ఉన్న ఓ చిన్న విమానం టేకాఫ్‌ తీసుకుంది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి పెంబ్రోక్‌ పైన్స్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దహనమయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారు. ఈ ప్రమాదంలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.