అటుకుల కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో కచ్చితంగా చేర్చేస్తారు. దేశంలో అత్యధిక ప్రజలకు ఇష్టమైన, ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పోహానే... సాధరణంగా అటుకులతో పాటు నిమ్మకాయ, పోపులు, ఇలాంటి చేసుకొని తింటాం. ఎప్పుడూ ఒకే వెరైటీ అయితే బోరు కొడుతుంది కదా.. మరి పోహాతో నచ్ని హండ్వొ అనే వెరైటీ వంటకం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
- పోహా - ఒక కప్పు
- పెరుగు, క్యారెట్ తరుగు,సొరకాయ తురుము,సజ్జ పిండి- ఒక్కోటి అర కప్పు
- బటానీలు - పావు కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
- పసుపు, ఇంగువ - చిటికెడు
- కారం - పావు టీస్పూన్
- ఉప్పు, నూనె - సరిపడా
- ఆవాలు - ఒక టీస్పూన్
- నువ్వులు - రెండు టీస్పూన్లు
తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు వేసి నీళ్లు పోసి కలపాలి. అందులో పోహా వేసి దాదాపు అరగంటసేపు నానబెట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత సజ్జ పిండి, క్యారెట్ తరుగు, ఉడికించిన బటానీలు, సొరకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, నువ్వులు, ఇంగువ వేయాలి. ఆ తాలింపు పై పోహా మిశ్రమాన్ని గరిటెతో పోయాలి. ఆ తర్వాత రెండు వైపులా కాల్చాలి. చల్లారాక పిజ్జాలాగ త్రికోణాకారంలో కట్ చేసుకుని తింటే బాగుంటాయి. ఇందులో సజ్జ పిండి బదులు రాగి పిండి కూడా వాడొచ్చు.
►ALSO READ | Telangana Kitchen..అటుకులతో వెరైటీ ఫుడ్.. కుర్ కురే.. కిచ్చు...కొత్త వంటకాలు.. రుచి అదిరిపోద్ది..
