Telangana Kitchen..అటుకులతో వెరైటీ ఫుడ్.. కుర్ కురే.. కిచ్చు...కొత్త వంటకాలు.. రుచి అదిరిపోద్ది..

Telangana Kitchen..అటుకులతో వెరైటీ ఫుడ్.. కుర్ కురే.. కిచ్చు...కొత్త వంటకాలు.. రుచి అదిరిపోద్ది..

వీకెండ్‌ అయినా.. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా..  సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఏదైనా యాక్టివిటీ చేయాలి అనుకుంటారు. అలాగే వారికి  కొత్త రుచులను  తినిపించాలనుకుంటారు. అలాంటా వారు పోహా(అటుకులతో) వెరైటీ ఫుడ్​ ట్రై చేయవచ్చు.  అలాంటివాళ్ల కోసమే ఈ వారం పోహా వెరైటీ స్పెషల్స్‌...

పోహాతో కుర్​కురే తయారీకి కావలసినవి

 

  • పోహా - పావు కిలో
  • ఆలుగడ్డలు - రెండు  
  • జీలకర్ర, కారం - ఒక టీస్పూన్
  • ఉప్పు - సరిపడా
  • బేకింగ్ సోడా - చిటికెడు
  • ఆమ్​చూర్ పొడి,చాట్ మసాలా, చక్కెర పొడి - ఒక్కోటి అర టీస్పూన్

తయారీ  విధానం:ఒక గిన్నెలో పోహా వేసి, నీళ్లు పోసి కడిగి కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డల్ని తురమాలి. అందులో నానబెట్టిన పోహా వేసి కలపాలి. ఆ మిశ్రమంలో జీలకర్ర, ఉప్పు, బేకింగ్ సోడా వేయాలి. ఆ తర్వాత ఒక కవర్​లో పెట్టి వడియాల్లా వేసి ఎండబెట్టాలి. ఒకరోజంతా ఎండిన తర్వాత పాన్​లో నూనె వేడి చేసి అందులో వేసి వేగించాలి. ఒక చిన్న గిన్నెలో ఆమ్​చూర్ పొడి, చాట్ మసాలా, చక్కెర పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ మసాలాను రెడీ చేసుకున్న వాటిలో  వేసి కలిపితే పోహా కుర్​కురే రెడీ.

అటుకులతో కిచ్చు వంటకం తయారీకి కావాల్సినవి :

  • పోహా పౌడర్ - ఒక కప్పు
  • జీలకర్ర - రెండు టీస్పూన్లు
  • బేకింగ్ సోడా - చిటికెడు
  • కారం - అర టీస్పూన్
  • ఉప్పు, నూనె - సరిపడా
  • వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం : పోహాను మిక్సీ పట్టి రవ్వలాగ గ్రైండ్ చేయాలి. పాన్​లో నీళ్లు పోసి బేకింగ్ సోడా వేయాలి. తర్వాత జీలకర్ర, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమం తెర్లాక పోహా పౌడర్​ వేసి కలపాలి. అది ఉప్మాలా అవుతుంది. ఆ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. సాస్​ కోసం.. ఒక పాన్​లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి తరుగు వేసి అవి వేగాక కారం, ఉప్పు వేయాలి. ఈ రెండింటి కాంబినేషన్‌ బాగుంటుంది. 

►ALSO READ | బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో నానో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పొట్టకు తిప్పలు