పోక్సో కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలు ...నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి  21 ఏండ్ల జైలు ...నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ అర్బన్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలుశిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి గురువారం సంచలన తీర్పు ఇచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీశ్​అదే గ్రామానికి చెందిన బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. 2018, జులై 23న కట్టంగూర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా నిందితుడు హరీశ్ పై అట్రాసిటీ, పోక్సో కేసులను నమోదు చేశారు. 

అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనల తర్వాత నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధితురాలికి  రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కేసులో సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.