వీడియో: గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్..

వీడియో: గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్..

ఒడిశా లోని జగత్ సింగ్ పూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టారు. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW ఉత్కల్ స్టీల్ లిమిటెడ్.. జగత్ పూర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అయితే దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ విలువైన భూములు ఇచ్చేది లేదని తెలిపారు. ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నా.. ప్రాజెక్టు విషయంలో అధికారులు ముందుకెళ్తున్నారు. దీంతో ఇవాళ మూకుమ్మడిగా గ్రామస్థులు స్టీల్ ప్లాంట్ నిర్మాణం దగ్గర ఆందోళన చేపట్టారు. నిరసన కారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.