హైదరాబాదీలకు షాక్ : ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు

హైదరాబాదీలకు షాక్ : ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు

ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విన్నాం.. చూశాం.. అనుభవించాం.. ఇక నుంచి హైదరాబాదీలకు కొత్త పరీక్షలు వచ్చాయి.. అదేంటో తెలుసా.. డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్.. అవును.. మీరు విన్నది నిజమే.. హైదరాబాద్ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టారు ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్.. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 వాహనం నడిపేటప్పుడు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకున్నారా అనేది తెలియడం కోసం తెలంగాణ పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రవేశపెట్టారు. , ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ‘ఎబోన్‌ యూరిన్‌ కప్‌’ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఈ పరీక్షల కిట్‌ను సమకూర్చి.. అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపింది. 

ఈ పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు మొదలయ్యాయి. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వస్తే ఈ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు కన్పిస్తే ‘నెగెటివ్‌’గా, ఒకటే గీత కన్పిస్తే ‘పాజిటివ్‌’గా పరిగణిస్తారు. టెస్ట్ కిట్ ఉపయోగించి గంజాయి వంటివి తీసుకన్నారా అనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 

ఇతర డ్రగ్స్ వినియోగంపై అనుమానం ఉంటే మూత్ర పరీక్ష నిర్వహించబడుతుంది అని తెలిపారు. పాజిటివ్ రిజల్ట్ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని, అవసరమైతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.