స్టీమ్ ఎంగేజ్ : హత్య చేసిందెవరు?

స్టీమ్ ఎంగేజ్ : హత్య చేసిందెవరు?

దాడి చేసిందెవరు? 

టైటిల్​ : కాల్‌‌‌‌కూట్‌‌‌‌

డైరెక్షన్​ : సుమిత్‌‌‌‌ సక్సేనా

కాస్ట్ : విజయ్‌‌‌‌ వర్మ, శ్వేతా త్రిపాఠి, సీమా బిశ్వాస్‌‌‌‌, యశ్‌‌‌‌పాల్‌‌‌‌ శర్మ, గోపాల్‌‌‌‌ దత్‌‌‌‌

లాంగ్వేజ్ : హిందీ

ప్లాట్​ ఫాం : జియో సినిమా

రవిశంకర్ త్రిపాఠి (విజయ్ వర్మ) సబ్ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తుంటాడు. రవి తండ్రి చనిపోవడంతో  కుటుంబ బాధ్యతలు అతనిపైనే పడతాయి. తల్లిని చూసుకుంటూ డ్యూటీకి వెళ్తుంటాడు. వాస్తవానికి అతనికి పోలీస్ జాబ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ.. తప్పక ఉద్యోగంలో చేరతాడు. అయితే, అతని పైఅధికారి రవిని ఎప్పుడూ అవమానిస్తుంటాడు. దాంతో అతను ఉద్యోగానికి రిజైన్ చేయాలి అనుకుంటాడు. అంతేకాదు.. అతని పైఆఫీసర్​కు రిజైన్​ లెటర్​ కూడా ఇస్తాడు. కానీ.. అతను దాన్ని యాక్సెప్ట్‌‌‌‌ చేయాలంటే. ఒక ఎఫ్​ఐఆర్​ రాయాలని కండిషన్​ పెడతాడు. ఆ ఎఫ్​ఐఆర్ తను పెళ్లిచేసుకోబోయే అమ్మాయిపై యాసిడ్​ దాడికి సంబంధించింది. రవి తల్లి అతనికి సంబంధం చూస్తుంది. ఆమె పేరు పారుల్ (శ్వేత). ఆమెపై యాసిడ్​ దాడి జరుగుతుంది. రవి రాసిన ఎఫ్​ఐఆర్ అదే. ఇంతకీ ఆ అమ్మాయిపై యాసిడ్​ పోసిందెవరు? రవి ఉద్యోగం మానేశాడా?  తెలుసుకోవాలంటే ఈ సిరీస్​ చూడాల్సిందే.   సిరీస్​ను 8 ఎపిసోడ్లుగా తీశారు. డైరెక్టర్​ కథను నడిపించే తీరు బాగుంది. ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్‌‌‌‌ రోల్స్​లో కనిపించిన విజయ్​ వర్మ పాజిటివ్‌‌‌‌ రోల్​లో కూడా బాగా చేశాడు. ఉద్యోగం చేయలేక నలిగిపోయే పోలీస్​ పాత్రలో ఒదిగిపోయాడు. 

హత్య చేసిందెవరు?

 

టైటిల్​ : పోలీస్​ స్టోరీ

డైరెక్షన్​ : రామ్ విఘ్నేష్

కాస్ట్ : శ్రీధర్ మాగంటి, శ్వేత అవస్తి, టెంపర్ వంశీ, ముక్తార్ ఖాన్, ప్రార్థన నాథన్

లాంగ్వేజ్ : తెలుగు

ప్లాట్​ ఫాం : ఈటీవీ విన్‌‌‌‌ 

ఆర్తి (శ్వేతా అవస్తి) ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆమె ఎసీపీ శివ(శ్రీనాథ్ మాగంటి) మాజీ భార్య. అయితే.. ఆర్తి పనిచేసే ఆఫీస్​లో ఒక హత్య జరుగుతుంది. విషయం తెలుసుకున్న కంపెనీ సీఈవో హత్య విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఫార్మాలిటీస్‌‌‌‌ త్వరగా పూర్తి చేయాలని పోలీస్​ కమిషనర్‌‌‌‌పై ఒత్తిడి పెడతాడు. దాంతో ఏసీపీ రియాజ్‌‌‌‌ (టెంపర్‌‌‌‌ వంశీ)కు కేసుని అప్పగిస్తారు. రియాజ్​ ఆ హత్య ఆర్తి చేసిందని అనుమానిస్తాడు. అయితే.. ఏసీపీ శివ అప్పటికే సస్పెన్షన్​లో ఉంటాడు. కానీ.. ఈ కేసు ఇన్వెస్టిగేషన్​లో ఇన్వాల్వ్ అయ్యేందుకు పర్మిషన్​ తీసుకుని క్రైం జరిగిన చోటుకు వస్తాడు. అయితే.. శివ మాత్రం ఆర్తికి ఈ హత్యతో సంబంధం లేదని నమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరు ఏసీపీల్లో హంతకుడిని కనిపెట్టిందెవరు? వీరిద్దరి మధ్య గొడవ ఏంటి? శివను ఎందుకు సస్పెండ్​ చేశారు? తెలియాలంటే సిరీస్​ చూడాల్సిందే. రజినీ కాంత్​తో ‘బాషా’ సినిమా తీసిన డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సురేష్ కృష్ణ ఈ వెబ్​ సిరీస్​ని నిర్మించాడు. శ్రీనాథ్ మాగంటి తన రోల్​లో ఒదిగిపోయాడు. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్​తో తెరకెక్కించారు. టెంపర్ వంశీ కూడా మెప్పించాడు. 

రివెంజ్​ స్టోరీ

టైటిల్​ : రెజీనా 

డైరెక్షన్​ : డొమిన్ డి సిల్వా

కాస్ట్ : సునైనా, అనంత్​ నాగ్​, ధీనా, వివేక్​ ప్రసన్న, భవ చెల్లడూరి, శరత్​ అప్పని, నివాస్​ ఆదిత్యన్​

లాంగ్వేజ్ : తమిళం

ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో

రెజీనా (సునైనా) చిన్నతనంలో తండ్రిని కోల్పోతుంది. రెజీనా కళ్ల ముందే తండ్రిని గన్​తో కాల్చి చంపేస్తారు. వాస్తవానికి ఆమె తండ్రి ఫ్రెండ్​ని చంపాలనుకుంటారు. కానీ ఆమె తండ్రిని చంపేస్తారు. అప్పటినుంచి వాళ్ల నాన్న ఫ్రెండ్​ దగ్గరే పెరుగుతుంది. పెద్దయ్యాక బ్యాంక్​ ఉద్యోగి జో (అనంత్ నాగ్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అంతా బాగుంది అనుకునేలోపే బ్యాంక్​ని  దోచుకోవడానికి వచ్చిన దొంగలు రెజీనా భర్తను చంపేస్తారు. అక్కడ అంతమంది ఉన్నా తన భర్తనే ఎందుకు చంపారనే  అనుమానం వస్తుంది ఆమెకు. దాంతో పోలీస్​ కంప్లైంట్​ ఇస్తుంది. కానీ.. ఎవరూ పట్టించుకోరు. సీన్​ కట్‌‌‌‌ చేస్తే.. ఇంటికి దూరంగా ఒక బీచ్​సైడ్​ రెస్టారెంట్​లో రెజీనా పనిచేస్తుంటుంది. ఆ రెస్టారెంట్​ జూలీ (రీతు మంత్రం)ది. అదే టైంలో జూలీ భర్త అరివు (నివాస్ ఆదితన్) జైలు నుండి విడుదలై వస్తాడు. వాస్తవానికి ఆ రోజు కోసమే రెజీనా చాలా రోజులుగా ఎదురుచూస్తుంటుంది. వెంటనే జూలీతోపాటు తన కూతుర్ని కూడా కిడ్నాప్​ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భర్తను చంపినవాళ్ల గురించి తెలుసుకుందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమాలో చాలా ట్విస్ట్‌‌‌‌లు ఉన్నాయి. సునైనా యాక్టింగ్​ బాగుంది. స్క్రీన్​ప్లే బాగుంది. రివెంజ్​ స్టోరీ అయినా డైరెక్టర్​ ఎక్కడా బోర్​ కొట్టకుండా తెరకెక్కించగలిగాడు.