కోడి పులావ్​తో థ్రిల్ అవుతారు

కోడి పులావ్​తో థ్రిల్ అవుతారు

శివ కోన,  ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య గిరీష్, అభిలాష్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌లో శివ కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి కోడి పులావ్’. అనిల్ మోదుగ, శివ కోన నిర్మించారు.  శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు  ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. శివ కోన మాట్లాడుతూ చిన్న సినిమా అయినా అద్భుతమైన కంటెంట్‌‌‌‌ను అందించారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. 

మరింత ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్న ప్రభాకర్.. కోడి పులావ్ రుచి చూస్తే కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పాడు.  బయట జరుగుతున్న పరిస్థితులనే సినిమాలో చూపించాం అంది నేహా దేశ్‌‌‌‌పాండే. టీమ్ అంతా కార్యక్రమంలో  పాల్గొన్నారు..