గద్వాల, వెలుగు: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందిని కేటాయించేందుకు ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావు, అబ్జర్వర్ గంగాధర్ తో కలిసి ర్యాండమైజేషన్ నిర్వహించి సిబ్బందిని కేటాయించారు.
అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో 716 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 567 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని చెప్పారు.1,34,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది వివరాలను సంబంధిత తహసీల్దార్లకు వెంటనే అందజేయాలని సూచించారు. డీపీవో శ్రీకాంత్, డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఈడీఎం శివ పాల్గొన్నారు.

