మహిళలకు గుడ్ న్యూస్..త్వరలో స్టాంప్ డ్యూటీ తగ్గింపు.!

మహిళలకు గుడ్ న్యూస్..త్వరలో స్టాంప్ డ్యూటీ తగ్గింపు.!

తెలంగాణలో కొత్త స్టాంప్  విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  వచ్చే శాసనసభలో స్టాంప్ సవరణ బిల్లు-2025 పెట్టాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం ఉంటుందని ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని  రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. 

ఈ బిల్లులో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని చూస్తోంది ప్రభుత్వం. పాత అపార్ట్ మెంట్లకు స్టాంప్ డ్యటీ వెసులు బాటు కల్పించాలని చూస్తోంది.  కొత్త స్టాంప్ బిల్లు అమల్లోకి వస్తే ఆస్తి విలువలో 6 శాతం విధించే అవకాశం ఉంది.  ఈ కొత్త బిల్లు ద్వారా మహిళలకు స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇవ్వడం వల్ల ఆస్తులను మహిళల పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. దీని వల్ల వారి భద్రతకు కూడా లభిస్తుంది.