వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం : ఎమ్మెల్యే సత్యం

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం :  ఎమ్మెల్యే సత్యం
  •     హాజరైన ఎమ్మెల్యే సత్యం

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఈ కల్యాణానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 

కార్యక్రమంలో కొడిమ్యాల ప్యాక్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాజనర్సింగరావు, మండల సర్పంచులు జీవన్ రెడ్డి, ల్యాగల రాజేశం, ఊట్కూరి శ్రీలత, కడారి మల్లేశం, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సతీశ్‌‌‌‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఈవో ఉడుతల వెంకన్న, సర్పంచ్ మాళవిక శ్రీకాంత్, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనాథ్ చారి  పాల్గొన్నారు. 

గంగాధర, వెలుగు: పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్, బూరుగుపల్లిలో సమ్మక్క– సారలమ్మ జాతరలో పాల్గొని బంగారం మొక్కు చెల్లించారు. భక్తులు జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజు, నాయకులు అంజి, సాగి అజయ్​రావు తదితరులు పాల్గొన్నారు.