ఎస్సీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్

ఎస్సీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఎస్సీ  కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్
  •     జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్ 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎస్సీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో సిటీలోని ఆర్అండ్‌‌‌‌బీ గెస్ట్ హౌజ్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మాట్లాడారు. జిల్లాలో ఎస్సీల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీలపై వివక్ష, అణచివేత ఘటనలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలని  సూచించారు. 

ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న విద్య, ఉపాధి, గృహనిర్మాణం, ఆరోగ్యం, సామాజిక భద్రత పథకాల అమలు తీరుపై సమీక్షించారు. సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, అడిషనల్ కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, లక్ష్మీకిరణ్‌‌‌‌, ఆర్డీవో కె.మహేశ్వర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ నాగైలేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అనిల్ ప్రకాశ్‌‌‌‌, ఏసీపీ వెంకటస్వామి, తదితరులు  పాల్గొన్నారు.