మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి : కలెక్టర్ విజయేందిర బోయి

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పకడబ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో పీవోలు, ఏపీవోల శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సీఎంవో సుధాకర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు బాలు యాదవ్, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.  

నామినేషన్ సెంటర్ల తనిఖీ

వనపర్తి, వెలుగు: ఆత్మకూరు, అమరచింత మున్సిపల్​ఆఫీస్​లలో ఏర్పాటు చేసిన నామినేషన్​సెంటర్లను శుక్రవారం కలెక్టర్​ఆదర్శ్​సురభి తనిఖీ చేశారు. నామినేషన్లను టీ -పోల్ యాప్​లో అప్‌‌‌‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలింగ్​మెటీరియల్​పంపిణీ సెంటర్లు ఏర్పాటు చేయనున్న ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, అమరచింత జడ్పీ హైస్కూల్ ను పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు.

ఆత్మకూరు కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌‌‌‌ వద్దకు వెళ్లి, భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఏడీసీ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తదితరులున్నారు.   

ఎన్నికలు పారదర్శకంగా జరపాలి

మక్తల్(నారాయణపేట): మున్సిపల్​ఎన్నికలు పారదర్శకంగా జరపాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ఆదేశించారు. శుక్రవారం మక్తల్ ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లను తనిఖీ చేశారు. శనివారం నామినేషనల్ స్క్రుటినీ అనంతరం ఆదివారం అప్పీల్​కు అవకాశం ఇస్తామన్నారు. సోమవారం డిస్పోజల్ అప్పీల్స్, మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

పోస్టల్ బ్యాలెట్ కోసం ఆయా పట్టణాల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మక్తల్ మినీ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్ కుమార్, సీఐ రాంలాల్ తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అధికారులతో మీటింగ్ నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. రోడ్ల పనులు జరుగుతున్న ప్రాంతాలకు కనీసం 500 మీటర్ల దూరంలో సూచిక బోర్డులు, డైవర్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పాఠశాల బస్సు ఫిట్​నెస్​ను ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

అలాగే ఎన్నికల వార్తలపై నిఘా ఉంచాలని చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రావొద్దని, ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్‌‌‌‌ భగీరథ ఎస్ఈ జగన్మోహన్​కు సూచించారు. జిల్లాలోని 1,216 ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. నీటి సరఫరాపై ఫిబ్రవరి 2 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌‌‌‌ నిర్వహించాలని చెప్పారు. అనంతరం డీపీఆర్వో ఆఫీస్​లో మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్​ను ప్రారంభించారు.  అడిషనల్​కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్​వో రవి నాయక్, డీఈవో రమేశ్​కుమార్  పాల్గొన్నారు.