- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్,వెలుగు: నగరాభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం 46వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా రాంనగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్‌లో పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం 24వ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, 29వ డివిజన్ అభ్యర్థి కంసాల శ్రీనివాస్, 51వ డివిజన్ అభ్యర్థి అశోక్‌రావు నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో గంగుల పాల్గొన్నారు.
బీఆర్ఎస్‌లోకి చేరికలు
42వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖలీద్ ఆలీ తన అనుచరులు 20 మందితో కలిసి గంగుల కమలాకర్ నివాసంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 59వ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ 100 మంది అనుచరులతో, 31వ డివిజన్‌కు చెందిన అలీబాబా బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో సిటీ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
