
హైదరాబాద్, వెలుగు : ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురవుతున్న ప్రాంతాలను కాపాడాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు బీజేపీ నేషనల్ కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయనను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలంలోని సీతారాముల దేవాలయం, భద్రాచలం టౌన్ తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుమారు 100 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని పొంగులేటి తెలిపారు. పోలవరం నిర్మాణంతో గత మూడేండ్లుగా కాపర్ డ్యాం మునిగిపోతోందని, దీంతో వేలాది మందికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.