DigiLocker అంటే ఏంటీ?..పాన్,ఆధార్లను డిజిలాకర్లో ఎందుకు సేవ్ చేయాలి?

DigiLocker అంటే ఏంటీ?..పాన్,ఆధార్లను డిజిలాకర్లో ఎందుకు సేవ్ చేయాలి?

DigiLocker ..విలువైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే ప్లాట్ఫాం..అంతేకాదు ఎమర్జెన్సీ టైంలో కీలక డాక్యుమెంట్లను భద్రపర్చి, అవసరమైన సమయంలో అందించే లాకర్. 
DigiLocker అనేది ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్. డిజీలాకర్ లో మన పాన్, ఆధార్, ఆర్థిక పరమైన డాక్యుమెంట్లను ఎందుకు సేవ్ చేయాలి.. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది.. ఎలా భద్రపర్చుకోవాలి వంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.  

DigiLocker ..ఇది దేశ ప్రజల విలువైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే డిజిటల్ వాలెట్..ఇది కస్టమర్ ఆధార్ నంబర్‌తో అనుబంధానం చేయబడి ఉంటుంది. పాన్ కార్డు,ఆధార్ కార్డు , బ్యాంక్ పాస్ బుక్ లు ఇలా విలువైన పత్రాలను ఆన్ లైన్ లో దాచుకోవచ్చు. 

భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో చాలా మంది ఒకవేళ యుద్దం వస్తే అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలి అనే ఆలోచనలో పడ్డారు.యుద్ధం లాంటి భౌగోళక రాజకీయ ఉద్రిక్తత అయినా, ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, వరదలు, లేదా సైబర్ దాడులు అయినా వ్యక్తిగత భద్రత లో భాగం కీలకమైన డాక్యుమెంట్ల భద్రత. ఈ క్రమంలో డిజీలాకర్ ఎంతో ఉపయోగపడుతందని సమాచార శాఖ చెబుతోంది. 

ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ లు, బీమా పాలసీలు, ఆస్తి డాక్యుమెంట్లు వంటి పలు కీలక పత్రాలు భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద తీసుకొచ్చింది డిజిలాకర్. గందరగోళ సమయాల్లో కూడా మీ డాక్యుమెంట్లు సురక్షితంగా ఉండేలా నమ్మదిగిన వాలెట్ డిజీలాకర్.

ఇంటర్నెట్,సురక్షితమైన లాగిన్ సహాయంతో భూమిపై ఎక్కడి నుండైనా కీలక డాక్యుమెంట్లను డిజీలాకర్ ద్వారా పొందవచ్చు. సరిహద్దు ఉద్రిక్తతల వంటి కష్టకాలంలో పౌరులు తమ గుర్తింపు, ఆస్తులు, ఆర్థిక పరమైన రికార్డులు, బీమా క్లెయిమ్ కు సంబంధించిన పత్రాలు డిజీ లాకర్ లో భద్రపరుచుకోవచ్చు. 

చట్టపరమైన చెల్లుబాటు,డేటా భద్రత

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం..డిజిలాకర్‌లో ఉంచిన డాక్యుమెంట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో కూడా చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా వాడుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి. హార్డ్ కాపీల అవసరం లేకుండానే అధికారిక ప్రయోజనాలకోసం సబ్మిట్ చేయొచ్చు.డిజిలాకర్ స్ట్రాంగ్ ఎన్‌క్రిప్షన్ ప్రోటోకాల్‌,భద్రతా ప్రమాణాలను ఉపయోగిస్తుంది. ఫోర్జరీ లేదా ట్యాంపరింగ్ నిరోధించేందుకు ఇది లాకర్ నుండి ఇ-డాక్యుమెంట్లను అధీకృత ఏజెన్సీలతో నేరుగా పంచుకోవచ్చు. 

డిజీలాకర్ ఎలా ప్రారంభించాలి?

డిజీలాకర్ ప్రారంభించేందుకు మొబైల్ నంబర్, ఆధార్ కార్డు ఉంటే చాలు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదా డిజిలాకర్ మొబైల్ అప్లికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కస్టమర్లు డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. లేదా ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌లను నేరుగా లాకర్‌లోకి పంపవచ్చు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ రికార్డులు, CBSE మార్క్ షీట్లు ,COVID-19 టీకా సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి సులభంగా అందుబాటులో ఉంటాయి. 

డిజిలాకర్ అంటే సౌకర్యం కాదు. అల్లకల్లోల ప్రపంచంలో ఇది కొత్త అవసరం. ప్రతి నిమిషం ,ప్రతి కాగితం ముఖ్యమైనవిగా ఉండే ఈ రకమైన సమయాల్లో మీ పాన్, ఆధార్ ,ఇతర కీలక ఆర్థిక డాక్యుమెంట్లను ప్రభుత్వ మద్దతు ఉన్న డిజిటల్ లాకర్‌లో సురక్షితంగా లాక్ చేయడం అనేది అధిక వ్యక్తిగత స్థితిస్థాపకత,మనశ్శాంతి వైపు ఒక అడుగు.