ఉదయనిధికి సుప్రీం నోటీసులు మంచి పరిణామం

ఉదయనిధికి సుప్రీం నోటీసులు  మంచి పరిణామం

హైదరాబాద్, వెలుగు: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తాయని బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్‌‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు కించపరిచారని మండిపడ్డారు.

 ఉదయనిధి కామెంట్లపై సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం మంచి పరిణామమని శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే, మంత్రి అయి కోట్ల మంది విశ్వాసాన్ని ఆయన దెబ్బతీశారని ఫైర్‌‌‌‌ అయ్యారు. కేబినెట్ నుంచి ఉదయనిధిని వెంటనే తొలగించాలని పొంగులేటి డిమాండ్ చేశారు.