SC Collegium:కొత్త జడ్జీల నియామకానికి..సుప్రీంకోర్టు కొలీజియం గ్రీన్ సిగ్నల్

SC Collegium:కొత్త జడ్జీల నియామకానికి..సుప్రీంకోర్టు కొలీజియం గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం (ఆగస్టు25) న జరిగిన సమావేశంలో అత్యున్నత న్యాయస్థానాకి ఇద్దరు కొత్త జడ్జీలను నియమించాలని కొలిజీయం నిర్ణయించింది. 

బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. ఈ నియామకంతో సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులతో బెంచ్ బలోపేతం అవుతుంది. 

ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ బివి నాగరత్నలతో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం జరిగిన సమావేశంలో ఈ సిఫార్సులను ఆమోదించింది. 

►ALSO READ | మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

జస్టిస్ అలోక్ ఆరాధే ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కాగా జస్టిస్ విపుల్ ఎం పంచోలి జూలైలో పాట్నా హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. 

జస్టిస్ పంచోలి గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ,అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఏడు సంవత్సరాలు పనిచేశారు.అహ్మదాబాద్‌లోని ఆల్మా మేటర్ సర్ LA షా కాలేజీలో 21 యేళ్లు విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.