షాకింగ్.. లవర్ను లాడ్జికి తీసుకెళ్లి.. నోట్లో జిలెటిన్ బాంబు పేల్చి.. చంపేసిన కిరాతకుడు

షాకింగ్.. లవర్ను లాడ్జికి తీసుకెళ్లి.. నోట్లో జిలెటిన్ బాంబు పేల్చి.. చంపేసిన కిరాతకుడు

క్రూర మృగాలను మించిన మనుషులు ఇటీవలి కాలంలో బయటపడుతున్నారు. అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్యలకు పాల్పడుతూ సమాజంలో అలజడి రేపుతున్నారు దుర్మార్గులు. వివాహేతర సంబంధాల కోసం పరితపిస్తూ కట్టుకున్న వాళ్లను కొందరు బలిచేస్తుంటే.. మరికొందరు ఏరికోరీ బలిపీఠమెక్కుతున్నారు.  కర్ణాటకలో సోమవారం (ఆగస్టు 25) లవర్ ను లాడ్జికి తీసుకెళ్లి నోట్లో జిలెటిన్ స్టిక్ పేల్చి చంపేశాడు ఓ రాక్షసుడు. 

హత్యకు గురైన మహిళ లాడ్జిలో బెడ్ పై ఘోరమైన పరిస్థితిలో పడి ఉండటం పోలీసులనే షాకింగ్ కు గురిచేసింది. జిలెటిన్ స్టిక్ తో పేల్చడంతో నోరు మొత్తం బ్లాస్ట్ అయ్యి.. రక్తపు మడుగులో పడి ఉండటం కలచివేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. మృతురాలు కర్ణాటక మైసూరు జిల్లా హున్సూర్ తాలుక జెరసనహల్లి గ్రమానికి చెందిన వివాహిత రక్షిత (20) గా గుర్తించారు పోలీసులు. ఆమె ప్రియుడు సిద్ధరాజుతో భేరియ గ్రామంలో లాడ్జిలోకి వెళ్లిన రక్షిత శవమై తేలింది. 

►ALSO READ | గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ ఈస్ట్ గోదావరి డిప్యూటీ తహసీల్దార్, బెంగళూర్ పెడ్లర్లు..

రక్షితకు అప్పటికే పెళ్లయింది. కేరళ రాష్ట్రానికి చెందిన లేబర్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల తల్లిగారి ఇంటికి వచ్చిన రక్షిత సిద్ధరాజుతో లాడ్జికి వెళ్లింది. అక్కడ వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరికి ఆమె నోట్లో జిలెటిన్ స్టిక్ పెట్టి పేల్చేశాడు. 

మొబైల్ పేలిందని డైవర్ట్ చేసే ప్రయత్నం:

జిలెటిన్ పేల్చిన తర్వాత మొబైల్ పేలిందని అరిచాడట. మొబైల్ పేలిందని అరిచి.. హోటల్ స్టాఫ్ కు కూడా అదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. మొబైల్ ఎక్కడ అని ప్రశ్నిస్తే కిటికీలో నుంచి బయటకు పడేసినట్లు చెప్పాడు. హోటల్ బయట, రూమ్ లోపల ఎక్కడ కూడా మొబైల్ కు సంబంధించిన ఎలాంటి ముక్కలు లేకపోవడంతో డ్రామా ఆడుతున్నట్లు గుర్తించి.. నిందితుడిని లాడ్జిలోనే బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు వారి పద్ధతిలో విచారించగా.. హత్యను ఒప్పుకున్నాడు. సాలిగ్రామా స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు.