గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ ఈస్ట్ గోదావరి డిప్యూటీ తహసీల్దార్, బెంగళూర్ పెడ్లర్లు.. హైదరాబాద్ సాఫ్ట్వేర్లు కూడా..

గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ ఈస్ట్ గోదావరి డిప్యూటీ తహసీల్దార్, బెంగళూర్ పెడ్లర్లు.. హైదరాబాద్ సాఫ్ట్వేర్లు కూడా..

డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్, మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేస్తోంది. అయినప్పటికీ స్మగర్లు, డ్రగ్ పెడ్లర్లు తగ్గడం లేదు. అపార్టుమెంట్లలో, ఫామ్ హౌస్ లలో సీక్రెట్ గా రేవ్ పార్టీలు నిర్వహిస్తూనే ఉన్నారు. సోమవారం (ఆగస్టు 25) హైదరాబాద్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు. 

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేశారు . 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్టసీ గుళికలు (20 గ్రాములు), 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఈస్ట్ గోదావరికి చెందిన క్లౌడ్ కిచెన్ వ్యాపారి, ప్రధాన పెడ్లర్ తేజను అరెస్టు చేశారు. అదేవిధంగా పౌల్ట్రీ వ్యాపారి, ఈస్ట్ గోదావరి పెడ్లర్ విక్రం, నార్సింగికి చెందిన మన్నే నీలిమను అదుపులోకి తీసుకున్నారు. 

బెంగళూరు ఇంజినీరింగ్ విద్యార్థి ట్రాన్స్‌పోర్టర్ చందన్, కొండాపూర్ కు చెందిన వైన్‌షాప్ వ్యాపారి, కన్జూమర్ పురుషోత్తం రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శేరిలింగంపల్లికి చెందిన కన్జూమర్ భార్గవ్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

డ్రగ్ సరఫరాదారు రాహుల్ అలియాస్ సోను (బెంగళూరు) తో పాటు మరో నిందితుడు మణిదీప్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఈస్ట్ గోదావరికి చెందిన క్లౌడ్ కిచెన్ వ్యాపారి తేజ కింగ్‌పిన్. రాహుల్ నుండి కొకైన్ తెచ్చి, ఇతరులకు సరఫరా చేసి, పార్టీలు ఏర్పాటు చేస్తుంటాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈగల్ టీం.. దీనికి వెనుక ఉన్న మిగతా ముఠా కోసం వివరాలు సేకరిస్తున్నారు. 

రాజమండ్రి, హైదరాబాద్, గోవాలో పార్టీలు  ఏర్పాటు చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ :

గచ్చిబౌలి రేవ్ పార్టీపై కీలక విషయాలు వెల్లడించారు మాదాపూర్ డీసీపీ వినీత్. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో రైడ్ నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు డీసీపీ. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ పెడ్లర్లు తేజ, విక్రమ్, ముగ్గురు వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్, ట్రాన్స్ పోర్టర్ చందన్ ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ కూడా పట్టుబడినట్లు చెప్పారు. 

రాహుల్ అనే బెంగళూరుకు చెందిన సప్లయర్ నుండి తేజ, విక్రమ్ డ్రగ్స్ కొనుగోలు చేశారని.. వీళ్లిద్దరితో పాటు నీలిమ అనే మహిళ డ్రగ్స్ ప్రొక్యూర్ చేసి గోవా, రాజమండ్రి లలో రేవ్ పార్టీలు నిర్వహించేవారు. తేజ న్యూ ఇయర్ సందర్భంగా గోవా లో ఒక రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు..అందులో నీలిమ కూడా ఉన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ విక్రమ్ మల్నాడు రెస్టారెంట్ సూర్యకు స్నేహితుడు అని చెప్పారు.  చందన్ అనే ట్రాన్స్ పోర్టర్ ద్వారా బెంగళూరుకు చెందిన రాహుల్ నుండి నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తారని చెప్పారు. 

ఈ కేసులు మణిదీప్ అనే నిందితుడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ తాసిల్దార్ గా పని చేస్తున్నాడు. మణిదీప్ రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రితో పాటు గోవాలో పార్టీలు అరేంజ్ చేస్తాడు. రాజమండ్రిలో మణిదీప్ కు సొంత ఫామ్ హౌస్ ఉంది. అక్కడ కూడా రేవు పార్టీలు ఏర్పాటు చేస్తుంటాడు. నీలిమ, తేజకు మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేశాడు. విక్రమ్, నీలిమ ఐటీ ఉద్యోగులు. తేజకు క్లౌడ్  కిచెన్ బిజినెస్ ఉంది.. బిజినెస్ లో లాభాలు రాకపోవడంతో రేవు పార్టీ అరేంజ్ చేస్తున్నారని తెలిపారు. 

బెంగళూరుకు చెందిన డ్రగ్ పెడ్లర్ రాహుల్ కు నైజీరియన్ చెందిన మైక్ డ్రగ్స్  సప్లయ్ చేస్తాడని.. తేజా డబ్బులు ఇస్తే చందన్ తీసుకు వస్తాడని తెలిపారు. బ్లూటో థియాన్ ఇంజెక్షన్  మాటున డ్రగ్స్ తీసుకు వచ్చారని వెల్లడించారు మాదాపూర్ డీసీపీ వినీత్.