తెలంగాణలో మాకు పోటీలేదు..ప్రతిపక్షం లేదు: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో మాకు పోటీలేదు..ప్రతిపక్షం లేదు: మహేశ్ కుమార్ గౌడ్

 తెలంగాణలో తమకు పోటీ లేదు.. ప్రతిపక్షం లేదని అన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  కవిత - కేటీఆర్ పంచాయతీ తెగే సరికి పదేళ్లు పడుతుందన్నారు. పదేళ్లు మోసం చేసిన కేసీఆర్ ఫామ్ హౌజ్ లో కూర్చున్నారని ఫైర్ అయ్యారు.దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీం కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.వాళ్ళు రాజకీయంగా ఉండరని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని.. ఇదే వర్ధన్నపేట గడ్డపై విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మహేశ్ కుమార్ గౌడ్. 

వరంగల్ లో జనహిత పాదయాత్రలో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఈసీ బీజేపీకి వత్తాసు పలుకుతుందన్నారు.  నిన్న నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీల గెలుపు పట్ల తమకు అనుమానం ఉంది. తెలంగాణలో ఓట్ల దొంగిలింపు జరిగింది. నేను ఆరోపణలు చేస్తే నా పై విమర్శలు చేస్తున్నారు.  ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.. కానీ బీజేపీ కి వత్తాసు పలుకుతుంది. మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్ లో కూడా వేశారు.  కిషన్ రెడ్డి మీకు బీసీల మీద ఇంత అక్కసు ఎందుకు. నీకు భయపడి బీజేపీలోని బీసీ నేతలు నోరు విప్పడం లేదు. బండి సంజయ్ పుట్టుక బీసీ కావచ్చు..కానీ బీసీ రిజర్వేషన్లకు అర్హుడు కాదు. దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగి ఓట్లు బిచ్చం ఎత్తుకున్న దొంగలు బీజేపీ నేతలు. మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి అనేక తప్పులు చేశారు. ఓట్ల దొంగతనం జరిగింది కాబట్టే బీహార్ లో రాహుల్ గాంధీ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు .

►ALSO READ | ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ