Upasana: రాంచరణ్ భార్య ఉపాసన ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ : ఆమె సామ్రాజ్యం విలువ రూ. 77 వేల కోట్లు!

Upasana: రాంచరణ్ భార్య ఉపాసన ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ : ఆమె సామ్రాజ్యం విలువ రూ. 77 వేల కోట్లు!

అపోలో హాస్పిటల్స్ వైస్-ఛైర్‌పర్సన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా బి పాజిటివ్ పేరుతో ఇటీవలే ఓ మ్యాగజైన్ను స్థాపించి.. దానికి చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ సక్సెస్ ఫుల్గా రాణిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ‘‘ఖాస్ ఆద్మీ పార్టీ’’ అనే పేరుతో ఉపాసన ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఇందులో 11పేజీల్లో స్పెషల్ నోట్ రాసి మహిళా సాధికారికతపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

ప్రస్తుత సమాజంలో తనకున్న గుర్తింపు ఎంతో ప్రత్యేకమని, ఈ లేటెస్ట్ పోస్ట్ ద్వారా ఉపాసన చెప్పుకొచ్చింది. అందుకు రూ.77,000 కోట్ల అపోలో సామ్రాజ్యానికి వారసురాలననో, స్టార్ హీరో రామ్ చరణ్కు భార్యననో కాదని వివరించింది. ఈ 77,000 కోట్ల సామ్రాజ్యానికి మించి, నాపై నాకున్న పట్టుదల, నాలో ఉన్న మానసిక ధైర్యం వల్లే ఈ గుర్తింపు అని తెలిపింది.

ఉపాసన ఇన్స్టా పోస్టు ద్వారా తన ప్రయాణాన్ని, మహిళా సాధికారతను వివరిస్తూ.. ‘కొన్నిసార్లు తన పనిపై తనకే సందేహం కలిగేదని, అప్పుడప్పుడు నిరుత్సాహపడ్డానని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టే దానినని ఉపాసన తెలిపింది. లింగ అసమానతలను లేకుండా మహిళలు తమ వ్యక్తిగత వృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని’ఉపాసన సూచన చేసింది. 

Also Read :  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్

అయితే, ఓ వ్యక్తిని ఏది ప్రత్యేకంగా నిలుపుతుందన్న అంశంపై ఉపాసన ఈ పోస్టు ద్వారా వెల్లడించింది. చివర్లో.. 'ప్రతిఒక్కరూ మీరు మీపై నమ్మకం ఉంచి, సొంత నమ్మకంతో రాణించాలనుకునే క్షణం నుండే మీరు "ఖాస్" అవుతారని కూడా ఈ పోస్ట్ ద్వారా వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే, ‘ఖాస్‌ ఆద్మీ’ అనేది రాజకీయ పార్టీ కాదని, దీన్నీ పేరిట సోషల్ ఇస్యూస్ మాత్రమే పంచుకోనుందని సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఉపాసన ముందు ముందు ఎలాంటి విషయాలపై మాట్లాడనుందో అనే ఆసక్తి ఈ పోస్ట్ క్రియేట్ చేసింది.