Allu Arjun: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ.. మార్కెటింగ్ కి ప్లాన్ రెడీ!

Allu Arjun:  హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ.. మార్కెటింగ్ కి ప్లాన్ రెడీ!

పాన్- ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ (  Allu Arjun ) , బ్లాక్‌ బస్టర్ దర్శకుడు అట్లీ ( Atlee ) కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ' AA22xA6 ' ( వర్కింగ్ టైటిల్‌ ).  లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీకి హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిన కొన్నెక్ట్ మోబ్‌సీన్ (Connekkt Mobscene) తోడ్పాటును అందిస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం గురించి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.

 ఈ కొన్నెక్ట్ మోబ్‌సీన్ సంస్థ ఇంతకు ముందు అవతార్, డ్యూన్, ఫాస్ట్ , ఫ్యూరియస్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు మార్కెటింగ్ వ్యూహాలను అందించింది. ఇటీవల, మోబ్‌సీన్ క్రియేటివ్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఇ.విస్కాంట్ భారతదేశాన్ని సందర్శించారు. ఆమె ఇక్కడ అల్లు అర్జున్-అట్లీ టీమ్‌ను కలవడం, ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచింది. దీంతో 'AA22xA6' సినిమాకు హాలీవుడ్ తో  మార్కెటింగ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్పతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. జవాన్ తో అట్లీ దర్శకుడిగా తన సత్తాను దేశవ్యాప్తంగా నిరూపించుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికతో సినిమా ప్రపంచంలో కొత్త సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ఈ నాలుగు పాత్రలు ఒకే కుటుంబానికి చెందిన పాత్రలు అని టాక్ వినిపిస్తోంది.

►ALSO READ | Bigg Boss 19: బిగ్ బాస్ 19లోకి అతి పిన్న వయస్కురాలు.. అష్ణూర్ కౌర్ టాలెంట్ మాములుగా లేదుగా!

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి, రష్మికా మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా యొక్క మొదటి ప్రమోషనల్ వీడియో కోసం అల్లు అర్జున్ మరియు అట్లీ లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలను సందర్శించారు. ఐరన్‌హెడ్ స్టూడియోతో పాటు జోస్ ఫెర్నాండెజ్, జేమ్స్ మాడిగన్ వంటి టెక్నీషియన్లను కలిసి మాట్లాడారు.

కళానిధిమారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించనున్నారని తెలుస్తోంది. సినిమా టైటిల్, విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.