
కోల్ కతా: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాల్ కృష్ణ సాహాను ఎన్ఫోర్స్మెంట్ డైరె క్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో విచారిస్తున్న సమయంలో ఎమ్మెల్యే గోడదూకి పారిపోయారు. దీంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం విచారణ కొనసాగిస్తుండగా అలాగే సాక్ష్యాలను నాశనం చేయడానికి తన మొబైల్ ఫోన్‌లను డ్రైనేజీలో పడేశారు. అయితే, అధికారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చివరకు ఆయనను అరెస్టు చేశారు.
►ALSO READ | షాకింగ్.. లవర్ను లాడ్జికి తీసుకెళ్లి.. నోట్లో జిలెటిన్ బాంబు పేల్చి.. చంపేసిన కిరాతకుడు
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పాఠశాల నియామకాల కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2023లో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2024 మేలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను ఇవాళ మరోసారి అరెస్ట్ చేసింది.