వచ్చే నెల 25 నుంచి హైటెక్స్‌‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్

వచ్చే నెల 25 నుంచి హైటెక్స్‌‌లో  పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
  • పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్

న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌‌ను నవంబర్ 25 నుంచి 28 వరకు మూడ్రోజుల పాటు హైదరాబాద్‌‌లోని హైటెక్స్‌‌లో నిర్వహించనున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. వికసిత్ భారత్‌‌లో భాగంగా స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌పో ‘వన్ నేషన్- వన్ ఎక్స్‌‌పో’థీమ్‌‌తో సాగనుందని చెప్పారు. 

నవంబర్ 25న నోవోటెల్‌‌లో నాలెడ్జ్ డేతో ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందులో సస్టయినబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌‌కు 50 దేశాల నుంచి 500కిపైగా ఎగ్జిబిటర్స్, 50 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని వివరించారు.