మెదక్, వెలుగు: మెదక్ పట్టణం, మెదక్, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ మెదక్ ఏడీఈ మోహన్ బాబు తెలిపారు.
ప్రజలకు మరింత నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్స్టేషన్లలో, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్, కరెంట్ తీగల మార్పులతో పాటు ట్రీ కటింగ్ తదితర పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. ఈ విషయం గమనించి సహకరించాలని ప్రజలను కోరారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట: శివ్వంపేటలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శభాష్ పల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ శివ్వంపేట్ సెక్షన్ ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు.
