ఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు

 ఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు

ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా  ప్రహ్లాద్ మోడీ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మోడీకి నలుగురు సోదరులు కాగా ప్రహ్లాద్ చిన్నవాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈయనకు కిరాణా దుకాణంతో పాటుగా టైర్ల షోరూమ్ ఉంది. ఇక గతేడాది డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోడీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కుటుంబంతో కలిసి బందీపూర్‌ నుంచి మైసూర్‌ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో అతని కుటుంబ సభ్యులు గాయపడ్డారు.