వేరే మతం యువకుడిని ప్రేమించిందని బిడ్డను కొట్టి చంపిర్రు.. యువకుడిని కూడా వదల్లేదు..!

వేరే మతం యువకుడిని ప్రేమించిందని బిడ్డను కొట్టి చంపిర్రు.. యువకుడిని కూడా వదల్లేదు..!

లక్నో: ఉత్తరప్రదేశ్‎లో దారుణం జరిగింది. మతాంతర ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా కొట్టి చంపారు. అనంతరం మృత దేహాలను నది ఒడ్డున పాతిపెట్టారు. తమ కొడుకు కనిపించడం లేదని యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..

వివరాల ప్రకారం.. మీరట్ జిల్లాలోని సబ్జీపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అర్మాన్ ఉమ్రీ (24), కాజల్ సైనీ (19) ఇద్దరు ప్రేమించుకున్నారు. కూతురి మతాంతర ప్రేమ కాజల్ కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రేమ వ్యవహారాలు బంద్ చేసుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పిన కాజల్ వినలేదు. దీంతో కూతురిపై కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. 

ఇదే సమయంలో కాజల్‎ను కలిసేందుకు అర్మాన్ వచ్చాడు. ఇలా ఇద్దరిని ఒక్కచోట చూసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యరు. కోపంలో ఇద్దరిని కొట్టి చంపారు. అనంతరం మృత దేహాలను తీసుకెళ్లి ఓ నది ఒడ్డున పాతిపెట్టి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చారు. మూడు రోజులుగా తమ కుమారుడు కనిపించకపోవడంతో అర్మాన్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాజల్ కుటుంబంపై తమకు అనుమానం ఉందని కంప్లైంట్ చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

►ALSO READ | హైదరాబాద్ మీర్ పేట్ లో .. బెట్టింగ్ కు మరో యువకుడి బలి

పోలీసులు కాజల్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. అర్మాన్, కాజల్ ప్రేమించుకోవడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరిని కొట్టి చంపినట్లు యువతి కుటుంబ సభ్యులు నేరం అంగీకరించారు. నిందితుల వివరాల ఆధారంగా పోలీసులు కాజల్, అర్మాన్ డెడ్ బాడీస్‎ను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ మేరకు కాజల్ కుటుంబ సభ్యులపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.