బ్యాంకుల్లో తాతలొదిన డబ్బులు .. పొందండి ఇలా!

బ్యాంకుల్లో తాతలొదిన డబ్బులు .. పొందండి  ఇలా!
  • అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి తెలుసుకునేందుకు ఉద్గమ్ పోర్టల్ తెచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ
  • ఒకే చోట 7 బ్యాంకుల్లోని వివరాలు పొందొచ్చు
  • ఈ డిపాజిట్లపై వడ్డీ కూడా వస్తుంది

బిజినెస్‌ ‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:  తాతలు, తండ్రులు మన కోసం బ్యాంకుల్లో ఏమైనా వదిలారో లేదో తెలుసుకోవాలని ఉందా? అయితే  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఉద్గమ్‌‌‌‌ (అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్స్–గేట్‌‌‌‌వే టూ యాక్సెస్ ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌)  పోర్టల్‌‌‌‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.  ఈ పోర్టల్‌‌‌‌లోకి వెళ్లి  మీకు కావాల్సిన వారి బ్యాంకు అకౌంట్లలో క్లయిమ్ చేసుకోకుండా(అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌) ఉన్న డిపాజిట్ల గురించి తెలుసుకోవచ్చు. ఇదొక సెంట్రలైజ్డ్ పోర్టల్. వివిధ బ్యాంకుల్లోని డిపాజిట్ల ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ను ఒకేచోట పొందడానికి వీలుంటుంది.  

ప్రస్తుతం ఏడు బ్యాంకుల్లోని అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి తెలుసుకోవచ్చు. అవి స్టేట్ బ్యాంక్‌‌‌‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మీ బ్యాంక్‌‌‌‌, సౌత్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌, డీబీఎస్ బ్యాంక్‌‌‌‌ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్‌‌‌‌. ఇందులో సిటీ బ్యాంక్ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్‌‌‌‌లో విలీనమయ్యింది.  నాన్ ఇండివిడ్యువల్స్‌‌‌‌ ఈ బ్యాంకులోని తమ  అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 15 లోపు మిగిలిన బ్యాంకులు కూడా ఈ పోర్టల్‌‌‌‌లో జాయిన్ కానున్నాయి.

రూ.48 వేల కోట్లు..

2021–22 నాటికి సుమారు రూ.48 వేల కోట్ల విలువైన అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు  ఉన్నాయని అంచనా. తమ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలో  అన్‌‌‌‌క్లయిమ్డ్ డిపాజిట్లు  ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తెచ్చిన పోర్టల్ సాయపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి ప్రజలు తెలుసుకునేందుకు ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను తీసుకొస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా లాంచ్ చేసింది.    కాగా, రెండేళ్లలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగకపోతే  సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లు డార్మెంట్‌‌‌‌ అయిపోతాయి. పదేళ్ల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్లు లేకపోతే ఈ అకౌంట్లలోని  డబ్బులు అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లుగా మారిపోతాయి. ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లు కూడా ఇందులో కలుస్తాయి. ఇటువంటి అకౌంట్లలోని ఫండ్స్‌‌‌‌ను ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ (డీఈఏ)’ ఫండ్‌‌‌‌కు సంబంధిత బ్యాంకులు పంపుతాయి. 

ఈ ఫండ్‌‌‌‌ను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మేనేజ్‌‌‌‌ చేస్తోంది. అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు డీఈఏ ఫండ్‌‌‌‌కి వెళ్లినప్పటికీ, వీటిని తిరిగి పొందొచ్చు.  వీటికి వడ్డీని యథావిధిగానే యాడ్ చేస్తారు. అకౌంట్ హోల్డర్లు తాము వాడమనుకునే  బ్యాంక్ సేవింగ్స్ లేదా    కరెంట్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ను క్లోజ్‌‌‌‌ చేయడం మరిచిపోతున్నారని,  అందుకే  అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు పెరుగుతున్నాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చెబుతోంది. ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లు చేసిన తర్వాత మరిచిపోవడంతో కూడా బ్యాంకుల్లో డబ్బులు మిగిలిపోతున్నాయని వెల్లడించింది. అకౌంట్ హోల్డర్  చనిపోయాక వారి కుటుంబ సభ్యులు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడం మరిచిపోతున్నారని, అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు పెరగడానికి ఇదొక కారణమని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వివరించింది.  

బ్యాంకింగ్ మరింత ఈజీగా..

ఉద్గమ్‌‌‌‌తో బ్యాంకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ మరింత మెరుగవుతుందని ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు. వివిధ బ్యాంకుల్లో  మరిచిపోయిన డిపాజిట్ల గురించి తెలుసుకోవడానికి ప్రజలకు వీలుంటుందని అంటున్నారు.  తమ డబ్బులను ఈజీగా తిరిగి పొందడంలో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త పోర్టల్ సాయపడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లోని డిపాజిట్ల గురించి మరిచిపోతే ఒక్కో బ్యాంక్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను  సపరేట్‌‌‌‌గా సెర్చ్ చేయాల్సి వస్తోంది. ఉద్గమ్‌‌‌‌తో అయితే ఒకే దగ్గర వివిధ బ్యాంకుల్లోని అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు గురించి తెలుసుకోవచ్చు.

చెక్  చేసుకోండి ఇలా..

ఉద్గమ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లో అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి చెక్ చేసుకోవాలంటే మొదట లాగిన్ కావడం తప్పనిసరి. మొబైల్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌, పేరు, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.  మొబైల్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌తో లాగిన్ అయ్యాక, నెంబర్‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా లాగిన్ అయ్యాక ఎవరి అకౌంట్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నామో వారి‌‌‌‌ పేరు, బ్యాంక్ పేరు ఇవ్వాలి. ఐడింటెంటిఫికేషన్‌‌‌‌ కోసం సంబంధిత వ్యక్తి పాన్ కార్డు, ఓటర్ ఐడీ నెంబర్‌‌‌‌‌‌‌‌, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌, డేట్‌‌‌‌ ఆఫ్ బర్త్‌‌‌‌ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ఒకటైనా ఇవ్వడం తప్పనిసరి. ఈ డిటైల్స్ ఇచ్చాక   నచ్చిన బ్యాంకుల్లో అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్లు ఉన్నాయో? లేదో? చెక్  చేసుకోవచ్చు. అలా వివిధ బ్యాంకుల్లో తమకు చెందిన అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి ఆరా తీయొచ్చు. ఇచ్చిన డిటైల్స్‌‌‌‌తో మ్యాచ్ అయి ఉంటే సంబంధిత అకౌంట్ హోల్డర్‌‌‌‌‌‌‌‌ గురించి, ఆ అకౌంట్‌‌‌‌లోని అన్‌‌‌‌క్లయిమ్డ్‌‌‌‌ డిపాజిట్ల గురించి డిస్‌‌‌‌ప్లే అవుతుంది. ఇచ్చిన డిటైల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కాకపోతే ‘ఏం లేవు’ అని  డిస్‌‌‌‌ప్లే అవుతుంది.