అమెజాన్ ప్రైమ్, స్నాప్‌చాట్, పెర్ప్లెక్సిటీ సహా ఈ యాప్స్, వెబ్‌సైట్స్ డౌన్.. దీపావళి రోజునే ఎందుకు ఇలా ?

 అమెజాన్ ప్రైమ్, స్నాప్‌చాట్, పెర్ప్లెక్సిటీ సహా ఈ యాప్స్, వెబ్‌సైట్స్ డౌన్.. దీపావళి రోజునే ఎందుకు ఇలా ?

నేడు సోమవారం ఆన్‌లైన్ ఇంటర్నెట్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దింతో ప్రముఖ వెబ్‌సైట్‌లు సహా యాప్స్  పనిచేయడం నిలిచిపోయాయి. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా, స్నాప్‌చాట్, పెర్ప్లెక్సిటీ, పేపాల్ వంటి వాటితో కొన్ని ఇతర యాప్స్, సైట్స్  కూడా ఉన్నాయి. దింతో  ఇంటర్నెట్ యూజర్లు, నెటిజన్లు ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా సమస్యలను ఎదుర్కొన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు. 

ఈ సమస్య అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) అనే కంపెనీలో సాంకేతిక లోపం వల్ల వచ్చిందని తెలుస్తోంది. డౌన్‌డెటెక్టర్ అనే వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం, చాలా దేశాలలో ప్రజలు ఈ సర్వీసులను ఉపయోగించుకోలేకపోయారు.

ఈ సమస్యకు కారణం ఏమిటి: AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్‌సైట్‌లు, యాప్‌లు వాటి డేటాను ఇంటర్నెట్‌లో భద్రపరచడానికి, స్టోర్ చేయడానికి ఈ సర్వీస్ ఉపయోగిస్తాయి. AWSలో సాంకేతిక లోపం కారణంగా వెబ్‌సైట్‌లు, యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అమెజాన్ క్లౌడ్ మౌలిక సదుపాయాల సమస్య కారణంగా  సర్వీసులకి అంతరాయం ఏర్పడిందని పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ కూడా పేర్కొన్నారు.

►ALSO READ | బంగారం ధర రూ.3 లక్షలకు చేరుకుంటుందా లేదా తగ్గుతుందా ? 100 ఏళ్ల చరితలో ఫస్ట్ టైం..

సోమవారం మధ్యాహ్నం, పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ Xలో పోస్ట్ చేస్తూ, పెర్ప్లెక్సిటీ ప్రస్తుతం డౌన్ అయ్యిందని అన్నారు. ఈ సమస్య అమెజాన్ వెబ్ సర్వీసెస్ కారణంగా వచ్చింది అలాగే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతోందన్నారు. 

అమెజాన్ ఏం చెప్పిందంటే : సమాచారం ప్రకారం, అమెజాన్ కూడా ఈ అంతరాయాన్ని అంగీకరించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. US-East-1 ప్రాంతంలో జాప్యం పెరిగింది.  కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. భారతదేశంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో  ఈ అంతరాయం సంభవించినట్లు తెలుస్తుంది. దాదాపు 16 వేల మంది  ఈ సమస్యను రిపోర్ట్ చేసారు. చాలా మంది  యాప్ హోమ్ పేజీని యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

దీపావళి రోజునే అంతరాయం: ముఖ్యంగా, దీపావళి పండగ రోజునే భారతదేశంలో ఈ సేవలు నిలిచిపోయాయి. భారతదేశంలో ప్రముఖ యాప్ అండ్ కనెక్ట్ అవ్వడానికి గొప్ప మార్గం అయిన స్నాప్‌చాట్ కూడా ఉపయోగించలేకపోయారు. చాలా మంది యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఈ సమస్య అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో జరిగినప్పటికీ, ఇది AWS సేవలను ఉపయోగించే చాల వెబ్‌సైట్‌లు, యాప్‌లను ప్రభావం చేసింది.