ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వర్లు

 ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వర్లు

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​ అనుబంధ ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖనికి చెందిన సీనియర్​లీడర్​రాచకొండ కోటేశ్వర్లును నియమిస్తూ యూనియన్​ఆల్​ఇండియా సీనియర్​ సెక్రటరీ బాబర్​ సలీంపాష బుధవారం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి  చేతుల మీదుగా కోటేశ్వర్లు అందుకున్నారు. యూనియన్​ బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. 

బెంచీలు మంజూరు చేయాలని వినతి

ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం శిల్వాకోడూరు హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు బెంచీలు మంజూరు చేయాలని విశాక ట్రస్ట్ మండల కో ఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ బుధవారం ట్రస్ట్ చైర్మన్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి త్వరలోనే బెంచీలు పంపిస్తామని హామీ ఇచ్చారు.