12 వేల ప్రత్యేక రైళ్లు ఎక్కడ..? బిహార్కు వెళ్లే రైళ్ల ఏర్పాట్లపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ

12 వేల ప్రత్యేక రైళ్లు ఎక్కడ..? బిహార్కు వెళ్లే రైళ్ల ఏర్పాట్లపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌ లో రైళ్ల ఏర్పాట్లపై కేంద్రాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఛత్​పండుగ వేళ బిహార్ కు వెళ్లే రైళ్లన్ని నిండిపోయాయని, టికెట్లు దొరకడం అసాధ్యంగా మారిందని తెలిపారు. సురక్షిత ప్రయాణం అనేది హక్కు అని ఫేవర్ కాదని పేర్కొన్నారు. ఈమేరకు శనివారం  (అక్టోబర్ 25) లో ఆయన పోస్ట్ పెట్టారు. 

“బిహార్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా మారింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుపుతున్నారు. జనం డోర్లు పట్టుకుని వేలాడుతున్నారు. చివరకు రూఫ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ పై కూడా ప్రయాణిస్తున్నారు” అని చెప్పారు. కేంద్రం, బిహార్ లో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ గవర్నమెంట్ పనితీరుపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 

‘‘మీరు చెప్పిన 12,000 ప్రత్యేక రైళ్లు ఎక్కడ? ప్రతి ఏడాది పరిస్థితులు ఎందుకు దారుణంగా మారుతున్నాయి. బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఎందుకు బలవంతంగా తిరిగి వస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి, గౌరవప్రదమైన జీవితం అందుబాటులో ఉంటే వారు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఉండేది కాదు. వీరు నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదు. ఎన్డీయే మోసపూరిత విధానాలకు నిదర్శనం. సురక్షితమైన ప్రయాణం ఒక హక్కు. ఫేవర్ కాదు” అని పేర్కొన్నారు.