
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే లోక్ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో ఆవేశానికి గురయ్యారు.
పాక్, భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నప్పుడు.. భారత విరోధి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను వైట్ హాస్కు ఆహ్వానించడానికి ట్రంప్‌కు ఎంత ధైర్యం అని ప్రధాని మోడీ ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఆగ్రహంగా ముందున్న బల్లను గట్టిగా కొట్టారు రాహుల్. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సభ ఆస్తి అని.. సభలో ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని చురకలంటించారు. వెంటనే రియాక్ట్ అయిన రాహుల్ గాంధీ.. తప్పు అయింది క్షమించండి సార్ అని క్షమాపణ చెప్పారు.
ALSO READ | మోదీ నాయకత్వంలో టెర్రరిజంపై రియాక్షన్మారిపోయింది: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్
అనంతరం రాహుల్ ప్రసంగిస్తూ.. ఇండియా–పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా అంటూ అమెరికా అధ్యక్షుడు పదే పదే చెబుతున్నాడని గుర్తుచేశారు. కాల్పుల విరమణ ప్రకటన కూడా తొలుత వాషింగ్టన్ నుంచే వెలువడిందని.. మోడీ సర్కారు మాత్రం కాల్పుల విరమణలో ఎవరి ప్రమేయం లేదని ప్రకటించిందన్నారు. ట్రంప్ అబద్ధమే చెబుతున్నాడని అనుకుంటే పదే పదే అదే అబద్ధం ఎందుకు చెబుతున్నట్లు అంటూ రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు.
ట్రంప్ చెప్పేది అబద్ధమంటూ ఇప్పుడు ఈ సభలో ప్రకటించడానికి ప్రధాని మోడీకి ఉన్న అభ్యంతరమేంటని నిలదీశారు. అదేవిధంగా పాక్‌ను ప్రపంచంలో ఒంటరిని చేశామని కేంద్రం ప్రచారం చేసుకుంటుండగా.. పాక్ మిలటరీ చీఫ్అమెరికా వెళ్లి ఏకంగా వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో లంచ్ చేసి వచ్చాడని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.