video viral: రైలు నెట్టుకుంటూ వెళ్లిన రైల్వే ఉద్యోగులు

video viral: రైలు నెట్టుకుంటూ వెళ్లిన రైల్వే ఉద్యోగులు

రోడ్ మీద ఆటో, కారు ఆగిపోతే కొంతదూరం నెట్టుకుంటూ పక్కన పెడతారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీలో ట్రాక్ పై ఆగిపోయిన భోగీని రైల్వే ఉద్యోగులు నెట్టుకుంటూ వెళ్లి సైడ్ ట్రాక్ లో నిలిపారు. ఇదంతా అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియో వైరల్ గా మారింది. లక్నోకు వెళ్లే పట్టాలపై ఇన్ స్పెక్షన్ కోచ్ ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో దాదాపు 20 మంది రైల్వే ఉద్యోగులు రంగంలోకి దిగి నెట్టుకుంటూ మెయిన్ ట్రాక్ నుంచి లూప్ ట్రాక్ మీదకు రైలును వెళ్లారు. 

దీనిపై సమాజ్ వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ స్పందిచారు. రైల్వే శాఖ మంత్రి ఎక్కడ ఆయన్ని కూడా పిలిపించి ఓ చేయి వేయమనండి అని కామెంట్ చేస్తూ ఆ వీడియో షేర్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కి ఎలక్టోరల్ బాండ్ల ఇంధనం అందలేదేమో అందుకే ఇలా నెట్టుకుంటూ వెళుతున్నారని అధికార పార్టీని ఎద్దేవా చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: మార్కెట్లోకి పొలిటికల్ చాక్లెట్లు, బిస్కెట్లు - క్యూ కడుతున్న నేతలు...