జీపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్పీ మహేశ్ బి. గీతే

జీపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్పీ మహేశ్ బి. గీతే

రాజన్నసిరిసిల్ల,వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గీతే అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీ ఆఫీసులో ఎన్నికల నిర్వహణపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అక్రమంగా మద్యం, నగదు తరలింపుపై నిఘా పెంచాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు, డైనమిక్ చెక్ పోస్ట్‌‌లు పెట్టి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్‌‌ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. 

బోయినిపల్లి, వెలుగు: జీపీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్​పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్‌‌ బి.గీతే అన్నారు. గురువారం బోయినిపల్లి మండలం నర్సింగాపూర్​ వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టును తనిఖీ చేశారు.