ఈ కానిస్టేబుల్ ఎంత మంచోడో : పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నాడు

ఈ కానిస్టేబుల్ ఎంత మంచోడో : పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నాడు

రాజస్థాన్ లో ధరమ్‌వీర్ జాఖర్ అనే ఓ కానిస్టేబుల్   ఆర్థికంగా వెనుకబడిన ఒక కుటుంబానికి చెందిన యువతి వివాహ సమయంలో మద్దతుగా నిలిచాడు. రాజస్థాన్‌లోని టెట్రా గ్రామంలోని మండవలోని ఝుంఝును జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు వివాహ వేడుకలకు సంబంధించిన ఆర్థిక ఖర్చులతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కష్టాలను గుర్తించిన కానిస్టేబుల్ జాఖర్‌ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

పలు ఆందోళనలకు తోడు, తల్లిదండ్రుల అనారోగ్య  సమస్యల రీత్యా ఆ కుటుంబానికి బాలిక వివాహానికి డబ్బు సమకూర్చడం మరింత సమస్యగా మారింది. ఈ పరిస్థితులతో సోషల్ మీడియాలో షేర్ అయిన వారి కథనానికి కానిస్టేబుల్ స్పందించారు. ఆ కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. సమస్యలతో పోరాడుతున్న ఆ కుటుంబానికి సహాయం చేసేందుకు పూనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.

కమ్యూనిటీ సహకారంతో జాఖర్.. రిఫ్రిజిరేటర్, కూలర్, ఫ్యాన్, బెడ్, పాత్రలు వంటి అవసరమైన వస్తువులతో పాటు మొత్తం రూ. 1లక్షా 31వేలు సేకరించగలిగాడు. అదనంగా, ఆ కుటుంబానికి రూ. 61వేల నగదును కూడా అందించాడు. అలా కానిస్టేబుల్ జాఖర్ ఆర్థికంగా వారికి చేయూతనిచ్చాడు. అంతే కాకుండా అతను వధువు సోదరుడు చేసే సంప్రదాయ విధులను సైతం నిర్వర్తించాడు. సమాజంలో ఇలాంటి దయతో కూడిన చర్యలు చాలా అవసరమని కానిస్టేబుల్ ఉద్ఘాటించారు. కానిస్టేబుల్ చేసిన పనికి వివాహ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంతో పాటు, కృతజ్ఞతను తెలియజేశారు.