
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ‘నువ్వు కావాలయ్యా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం పెట్టారు మేకర్స్. ‘హుకుం’ సాంగ్‌ను జులై 17న విడుదల చేయనున్నట్టు చెబుతూ.. శనివారం ప్రోమోను వదిలారు.
ఇందులో రజినీ డైలాగ్స్, స్టైల్ ఇంప్రెస్ చేస్తున్నాయి. ‘ఏయ్ ఇక్కడ నేనే కింగ్. నేను చెప్పేవే రూల్స్. రూల్స్ ఇష్టం వచ్చినట్టు తప్పితే ఎవర్నీ వదిలిపెట్టను. ఇది హుకుం.. టైగర్ కా హుకుం’ అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ పాటపై అంచనాలు పెంచేలా ఉంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది.
పలువురు తమిళ నటీనటులతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్ నుండి నాగబాబు, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా ఇందులో నటిస్తున్నారు. ఆగస్టు 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.