
- ఇకపై పులులు భయపడాల్సిందే
- ఆలస్యమైనా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది: రాంగోపాల్ వర్మ
హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ లాంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. 'రేవంత్ రెడ్డి సింహంలాంటోడు..ఇక పులులు భయపడాల్సిందే' అంటూ ట్విట్టర్ లో పెట్టిన కామెంట్ కలకలం రేపుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నియామకంపై ఆయన ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించారు. ఆలస్యమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై ఆసక్తి కలుగుతోంది.. రాహుల్ గాంధీ.. ఆయన తల్లి సోనియా గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీపై పొగడ్తలతో ఆర్‌జివి ట్వీట్ చేశారు.