కోడ్ పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

 కోడ్ పక్కాగా అమలు చేయాలి :  కలెక్టర్ సి.నారాయణరెడ్డి
  • రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి 

రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్​ను పక్కాగా అమలయ్యేలా చూడాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. ప్రలోభాలపై నిఘా ఉంచాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు.