Hema Malini: ‘ధరం జీ నువ్వే నా సర్వస్వం.. ఈ బాధ వర్ణించలేనిది’: ధర్మేంద్ర రెండో భార్య ఎమోషనల్ పోస్ట్

Hema Malini: ‘ధరం జీ నువ్వే నా సర్వస్వం.. ఈ బాధ వర్ణించలేనిది’: ధర్మేంద్ర రెండో భార్య ఎమోషనల్ పోస్ట్

దిగ్గజ నటుడు, దివంగత ధర్మేంద్ర డియోల్ Dharmendra సోమవారం (2025 నవంబరు 24న) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఇండియన్ సినీ పరిశ్రమతో పాటుగా ఎంతోమంది అభిమానులు స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కానీ, ఈ దిగ్గజ నటుడి మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు నుంచి ఎవరూ ఎటువంటి ప్రకటనను పంచుకోలేదు. ఇది ఎంతో బాధాకరం. ఈ క్రమంలోనే ధర్మేంద్ర చనిపోయిన మూడు రోజుల తర్వాత, ఆయన రెండో భార్య నటి హేమ మాలిని (Hema Malini) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

తన దివంగత భర్తను తలుచుకుంటూ.. ‘ధరం జీ నువ్వే సర్వస్వం! నా వ్యక్తిగత నష్టం వర్ణించలేనిది. మీరు లేని ఈ శూన్యత నా జీవితాంతం ఉంటుంది. మనం ఎన్నో సంవత్సరాలు  కలిసి చేసిన ఈ ప్రయాణంలో.. ఎన్నో మరుపురాని క్షణాలు ఉన్నాయి. వాటిని తిరిగి పొందడానికి నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయని’ నటి హేమ మాలిని భావోద్వేగం అయ్యారు.

అలాగే ధర్మేంద్ర సినీ & వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ.. ‘‘ధర్మేంద్ర ప్రేమగల భర్తగా, మా ఇద్దరు అమ్మాయిలు, ఈషా & అహానాలకు మంచి తండ్రిగా జీవించాడు. అంతేకాదు.. ధర్మేంద్ర మాకు ఒక స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి, కవి.. నిజానికి, ఆయన మాకు ప్రతిదీ! ఆయన తన ప్రేమానురాగాలతో నా కుటుంబ సభ్యులందరికీ ప్రియమైన వ్యక్తిగా నిలిచారు.

దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ఆయనలోని నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతం. అతని సార్వత్రిక ఆకర్షణే భారత దిగ్గజాలలో అసమానమైన వ్యక్తిగా నిలిచేలా చేశాయి. సినీ పరిశ్రమలో ధర్మేంద్ర సాధించిన కీర్తి మరియు విజయాలు శాశ్వతంగా ఉంటాయి’’ అని హేమమాలిని తన భర్తతో ఉన్న అనుభంధాన్ని గుర్తుచేసుకుంది. 

ఈ క్రమంలో ఆమె ధర్మేంద్రతో కలిసి నటించిన షోలే మూవీ ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హేమ మాలిని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటుడు ధర్మేంద్ర అలనాటి హీరోయిన్ హేమా మాలిని ​(1980)లో పెళ్లాడారు. ధర్మేంద్ర మరియు హేమకు ఇద్దరు పిల్లలు. ఈషా డియోల్, అహానా డియోల్. ధర్మేంద్ర కుమారులు, కూతుళ్లు సినీ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్స్గా రాణిస్తుండటం విశేషం.

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం: 

దిగ్గజ నటుడు ధర్మేంద్ర రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అయితే, ధర్మేంద్ర తన 19 సంవత్సరాల వయసులో.. అంటే, నటుడు కాకముందు.. మొదట భార్య ప్రకాష్ కౌర్‌ను 1954లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్ మరియు అజితా డియోల్.

ఇక ఆ తర్వాత నటుడిగా, స్టార్ స్టేటస్ అనుభవించే క్రమంలో.. అలనాటి హీరోయిన్ హేమా మాలిని ​(1980)లో పెళ్లాడారు. ధర్మేంద్ర మరియు హేమకు ఇద్దరు పిల్లలు. ఈషా డియోల్, అహానా డియోల్.

ఈ లెక్కన చూసుకుంటే.. నటుడు ధర్మేంద్రకు సంతానంగా మొత్తం ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురు సంతానానికి పెళ్లిళ్లు అవ్వడమే కాకుండా.. వారికి పిల్లలు ఉన్నారు. అలా ధర్మేంద్ర వంశ వృక్షంలో ఆరుగురు పిల్లలు ఉండగా.. 13 మంది మనవళ్లు, మనవరాళ్ళు కలిగి ఉన్నారు.

ఇకపోతే ధర్మేంద్ర.. తన 89 ఏళ్ల వయసులో 2025 నవంబరు 24న ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ దిగ్గజ నటుడు జీవించిన జీవితం ఎంతోమందికి మార్గదర్శంగా నిలిచింది. ఆయనలో నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతం. దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ధర్మేంద్ర.. ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా.. భారతీయ సినీ చరిత్రలో ఒక మహోన్నత మానవుడిగా చరిత్రలో నిలిచిపోయేలా జీవించారు.