
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja ) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యువతలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రవితేజ నుండి.. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar Rao) మూవీ నుంచి డైరెక్టర్ వంశీ అప్డేట్ ఇచ్చారు.
'హలో తమ్ముళ్లు, మీ మెసేజ్ లు చూసాక.. మీకు మళ్ళీ ఎంత ఆకలేస్తోందో అర్థమవుతుంది..ఈ సారి మనం పెంచిన పులి వేటాడానికి సిద్ధమవుతుంది. అతి త్వరలో టీజర్ అప్డేట్ ఉంటుంది..కొంచెం ఓపిక పట్టండి' అంటూ డైరెక్టర్ ట్వీట్ చేశారు. దీంతో మాస్ రవితేజ ఫ్యాన్స్.. దాహం తీరింది..టీజర్ తో ఆకలి తీర్చండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ లో 'జింకలను వేటాడే పులులను చూసుంటావు. కానీ పులులను వేటాడే పులిని చూసావా అంటూ రవితేజ చెప్పే డైలాగుతోనే ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసారి. ఇక టీజర్ తో మరింత జోష్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ రవితేజ కెరీర్‌లో లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ రవితేజకు జోడీగా నటిస్తుండగా..రేణూదేశాయ్ హేమలత లవణం కీ రోల్ పోషిస్తుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకు దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా.. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించింది టీమ్.