పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 19 మందిపై కేసు నమోదు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 19 మందిపై కేసు నమోదు

రేగోడ్, వెలుగు: పేకాట స్థావరంపై శనివారం రాత్రి పోలీసులు రైడ్ చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సీఐ రేణుక రెడ్డి రేగోడు పీఎస్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, పటాన్​చెరు, శంకర్​పల్లి, జనవాడ, చేవెళ్ల, అల్వాల్ ప్రాంతాలకు చెందిన యువకులు మండల పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో ఓ షెడ్డులో పేకాట ఆడుతుండగా పట్టుకున్నామన్నారు.

19 మంది యువకులపై కేసు నమోదు  చేశామని, ఘటనా స్థలం నుంచి రూ.2,19,000  నగదు, సెల్ ఫోన్లు , కారు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు వివరించారు. పేకాట ఆడుకోవడానికి సహకరించిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. ఆమె వెంట ఎస్ఐ పోచయ్య ఉన్నారు.