కంపెనీల ఆడిటర్లు ఇంకా హుషార్‌‌ కావాలె

కంపెనీల ఆడిటర్లు ఇంకా హుషార్‌‌ కావాలె
  • లోపాలకు అవకాశం లేని అకౌంటింగ్ విధానాలు ఎంచుకోవాలి
  • ఆడిటింగ్‌‌ సిస్టమ్​ను మరింత విశ్వసనీయంగా తీర్చిదిద్దాలి
  • టెక్నికల్‌‌ నాలెజ్ పెంచుకోవాలె
  • ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ కావాలె
  • తప్పులకు అవకాశం ఇవ్వొద్దు
  • ఆడిటర్లకు ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌ సూచన

ముంబై: కంపెనీల ఆడిటర్లు మరింత చురుగ్గా ఉండాలని, కాలానికి తగ్గట్టుగా మారాలని రిజర్వు బ్యాంకు గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌ సూచించారు. టెక్నికల్‌‌ నాలెడ్జ్‌‌ను పెంచుకోవాలని, ఎలాంటి లోపాలకూ అవకాశం లేని అకౌంటింగ్‌‌ విధానాలను ఎంచుకోవాలని అన్నారు. ఆడిట్‌‌బుక్స్‌‌లో ఎంట్రీలను రికార్డు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే, కంపెనీల స్మార్ట్‌‌ అకౌంటింగ్‌‌ విధానాలను అడ్డుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. లాభాలను ఎక్కువ చేసి చూపించేందుకు.. అప్పులను, ఖర్చులను తక్కువ చేసి చూపించేందుకు కంపెనీలు స్మార్ట్‌‌ అకౌంటింగ్‌‌ను వాడుతున్నాయని విమర్శించారు. రూల్స్‌‌ పాటించకుండా రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారని దాస్‌‌ వివరించారు. ఒక కంపెనీ.. ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న ఇతర కంపెనీలతో లేదాషేర్‌‌హోల్డర్‌‌ గ్రూప్స్‌‌,సబ్సిడరీలు,మైనారిటీ ఓన్డ్‌‌ కంపెనీలతో చేసే లావాదేవీలను రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లు అంటారు. వీటిలో మెజారిటీ ట్రాన్సాక్షన్లు చట్టవిరుద్ధమని ఆడిటర్లు చెబుతుంటారు. ఇట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఆర్‌‌బీఐ వంటి రెగ్యులేటర్లకు తెలియజేయాలి. ఇంట్రాగ్రూప్‌‌ లోన్స్‌‌ వంటి పద్ధతుల్లో నిధులను, ఆస్తులను మళ్లించడం/బదలాయించడాన్ని కూడా రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లు అంటారు. 
అక్రమాలకు అడ్డుకట్ట వేయాలె
‘‘ఇటీవల చాలా రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్ల గురించి బయటపడింది. రూల్స్‌‌ను పట్టించుకోకుండానే ముందుకు వెళ్లారు. ట్రాన్స్‌‌ఫర్‌‌ ప్రైసింగ్‌‌ పద్ధతులను అనుసరించారు. అడ్డగోలుగా ఫండ్స్‌‌ను మళ్లించారు. ఆడిటర్లు ఇలాంటి వాటిని సరైన సమయంలో గుర్తించాలి. రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లను, అండర్‌‌ ఇన్‌‌వాయిసింగ్‌‌ను, తగిన వాల్యుయేషన్‌‌ లేకుండా జరిగిన ఆస్తుల బదిలీలను గుర్తించి పట్టుకోవాలి’’ కాంత్‌‌ వివరించారు. ఎంప్లాయిస్‌‌ ఒపెగ్‌‌ టెక్నికల్‌‌ మీన్స్‌‌ (ఐటీ బ్లాక్‌‌ బాక్సులు) ద్వారా ఫైనాన్షియల్‌‌ స్టేట్‌‌మెంట్లను తారుమారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని గుర్తించాలంటే ఆడిటర్లు టెక్నికల్‌‌ నాలెడ్జ్‌‌ను పెంచుకోవాలని అన్నారు. ‘‘ఆడిటింగ్‌‌ కోసం టెక్నికల్‌‌ టూల్స్‌‌ వాడినంత మాత్రాన వృత్తిపరమైన విచక్షణను వదిలేయాలని కాదు. మన మైండ్‌‌నూ వాడి మంచిచెడులను గుర్తించాలి.  ట్రాన్సాక్షన్లను టెక్నికల్‌‌గా, ఫ్రొషెనల్‌‌గా పరిశీలించాలి’’ ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ వివరించారు. ‘‘ఆడిటర్లపై, రెగ్యులేటర్లపై నమ్మకాన్ని బట్టి ఫైనాన్షియల్‌‌ మార్కెట్లు బలపడతాయి.  టెక్నాలజీ వల్ల ఎకానమీకి సంబంధించిన సమాచారం అంతా అందరికీ అందుబాటులో ఉంటున్నది. మనం చేయాల్సిందల్లా జనానికి భరోసా ఇవ్వాలి. ఆడిటింగ్‌‌ సిస్టమ్​ను మరింత విశ్వసనీయంగా మార్చాలి’’ అని స్పష్టం చేశారు.