
వాట్సాప్.. ప్రముఖ మేసేజింగ్ యాప్..ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్ది యూజర్లున్నమేసేజింగ్ యాప్..వాట్సాప్ తన యూజర్లకోసం ఎప్పటికప్పుడు భద్రతాపరమైన సెక్యూరిటీ ఆప్షన్లు, కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటివరకు AI తో అనేక రకాల ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సాప్ AI జనరేటెడ్ వాల్ పేపర్ల కోసం ఫీచర్. ఈ ఫీచర్ తో బెనిఫిట్స్, ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్ స్టాల్ చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం..
వాట్సాప్ తన యూజర్లకు AI-జనరేటెడ్ వాల్‌పేపర్లను అందించే ఫీచర్ను తీసుకొచ్చింది. ఇది యూజర్ల చాట్‌లకు పర్సనల్ టచ్, స్పెషల్ బ్యాక్‌గ్రౌండ్‌లను సృష్టించేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ Meta AI ద్వారా పనిచేస్తుంది.
AI-జనరేటెడ్ వాల్‌పేపర్లు అంటే..
AI-జనరేటెడ్ వాల్‌పేపర్లు అంటే టెక్స్ట్ రూపంలో అందించిన వివరణ ఆధారంగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ఫొటోలను సృష్టించడం. ఉదాహరణకు సముద్రం పైన సూర్యాస్తమయం లేదా ఫ్యూచరిస్టిక్ నియాన్ సిటీస్కేప్ అని టైప్ చేస్తే Meta AI ఆ వివరణకు సరిపోయే వివిధ వాల్‌పేపర్ డిజైన్లను రూపొందిస్తుంది.
ALSO READ : ఆపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) గా భారత సంతతి వ్యక్తి
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
- ఈ ఫీచర్‌ను పొందడానికి iOS యూజర్లు వాట్సాప్‌ను వెర్షన్ 25.19.75కు అప్‌డేట్ చేయాలి. Android యూజర్లు తాజా బీటా వెర్షన్‌ను కలిగి ఉండాలి.
- వాట్సాప్‌ను ఓపెన్ చేసి Settings (సెట్టింగ్‌లు)కు వెళ్లాలి.
- Chats (చాట్‌లు) పై క్లిక్ చేయాలి.
- Default chat theme (డిఫాల్ట్ చాట్ థీమ్) లేదా Chat theme (చాట్ థీమ్) సెలెక్ట్ చేసుకోవాలి.
- ఈ సెట్టింగ్‌లలో Create with AI అనే కొత్త విభాగం కనిపిస్తుంది.
- దీనిలో మీ వివరణను (Prompt) అందించాలి. Create with AI పై క్లిక్ చేయగానే ఒక టెక్స్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది. అందులో కోరుకున్న వాల్‌పేపర్ గురించి వివరణ ఇవ్వాలి.
- Meta AI మీ ప్రాంప్ట్‌ను ప్రాసెస్ చేసి, అనేక ఫొటో ప్రివ్యూలను చూపిస్తుంది. మీరు ఈ ప్రివ్యూలను స్వైప్ చేసి చూడవచ్చు.అందులో సెలెక్ట్ చేసుకోవాలి.
- ఒకవేళ ఆ వాల్ పేపర్లు నచ్చకపోతే Make Changes బటన్‌ను క్లిక్ చేసి ఫొటోను మార్చుకోవచ్చు.
- ఇలా నచ్చిన వాల్‌పేపర్‌ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని స్థానాన్ని సర్దుబాటు చేసి, ప్రకాశాన్ని నియంత్రించవచ్చు. చివరికి "Set" బటన్‌ను నొక్కి మీ చాట్ స్క్రీన్‌కు వాల్‌పేపర్‌ను అప్లై చేయవచ్చు.
ఈ ఫీచర్ ప్రయోజనాలు:
- స్టాక్ వాల్‌పేపర్‌ల కంటే చాలా ఎక్కువ నచ్చిన ఆప్షన్లను ఉంటాయి.
- మీ ఊహకు తగినట్లుగా ప్రత్యేకమైన డిజైన్లను సృష్టించుకోవచ్చు.
- మీ చాట్‌లను మరింత ఆసక్తికరంగా,వ్యక్తిగతంగా మార్చుకోవచ్చు.
- ఈ ఫీచర్ ప్రస్తుతం iOS ,Android బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది క్రమంగా స్థిరమైన వెర్షన్ యూజర్లకు కూడా విడుదల చేయబడుతుంది. అయితే Meta AI ,కొన్ని అనుభవాలు ప్రస్తుతం పరిమిత దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ,ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, హిందీ, ఇండోనేషియన్, పోర్చుగీస్, స్పానిష్, తగలోగ్, థాయ్, వియత్నామీస్ వంటి భాషలకు మాత్రమే సపోర్టు చేస్తుంది.
వాట్సాప్ AI ఆధారిత ఫీచర్లను తన ప్లాట్‌ఫాంలో మరింతగా చేర్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ వాల్‌పేపర్ ఫీచర్ ఆ దిశగా ఒక అడుగు.