షావోమీ నుంచి రెడ్‌‌మీ నోట్‌‌ 11టీ 5జీ

షావోమీ నుంచి రెడ్‌‌మీ నోట్‌‌ 11టీ 5జీ

చైనా ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీ షావోమీ ఇండియా మార్కెట్లోకి రెడ్‌‌మీ నోట్‌‌ 11టీ 5జీ పేరుతో మిడ్‌‌రేంజ్ స్మార్ట్‌‌ఫోన్‌‌ను లాంచ్ చేసింది. దీనిలో 6.60 ఇంచుల స్క్రీన్‌‌, మీడియాటెక్‌‌ 810 ప్రాసెసర్‌‌, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక డ్యూయల్‌‌ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఇది మూడు వేరియంట్లలో  వస్తుంది.  బేస్‌‌ వేరియంట్‌‌- 6జీబీ + 64జీబీ ధర రూ.17 వేలు. 6జీబీ + 128జీబీకి రూ.18 వేలు కాగా, 8జీబీ + 128జీబీకి రూ.20 వేలు. ఈ నెల ఏడో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి.