రియల్ మీ 4జీ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లివే

రియల్ మీ 4జీ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లివే
  • ధర రూ.6,999

తక్కువ బడ్జెట్ లో 4జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి కోసం రియల్ మీ కొత్త ఫోన్ ను విడుదల చేసింది. సీ11 సిరీస్ కొనసాగింపుగా కొత్త ఫీచర్లతో సీ11(2021)ను లాంచ్ చేసింది. దీని ధర రూ.6,999గా నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న సీ11 4జీ ఫోన్ల ధరలు రూ.7,499 కాగా.. కొత్త వేరియంట్లలో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.1500 మేర తగ్గించారు.  ఆన్ లైన్ లో రియల్ మి.కామ్ వెబ్ సైట్ నుంచి నేరుగా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ క్లాసుల కోసం బడ్జెట్ ఫోన్ ను వెతుకుతున్న వారికి ఇది సరైన ఆప్షన్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫీచర్ల వివరాలకు వస్తే.. సీ11 2జీబీ/32 జీబీ వేరియంట్ లో విడుదల చేశారు. ఆండ్రాయిడ్ 11తో రియల్ మీ యూఐ 2.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ముందు వైపు 5ఎంపీ కెమెరా, వెనుక వైపు 8ఎంపీ కెమెరా ఉంది. 5వేల ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ.. ఓటీజీ ద్వారా రివర్స్ ఛార్జింగ్ సదుపాయం. ఇంటర్నల్ స్టోరోజీని 256 జీబీ దాకా పెంచుకునే సదుపాయం ఉంది.